Homeఆంధ్రప్రదేశ్సరస్‌కు పకడ్బందీ బందోబస్తు

సరస్‌కు పకడ్బందీ బందోబస్తు

📰 Generate e-Paper Clip



రక్షణ న్యూస్, గుంటూరు

సరస్ – అఖిల భారత డ్వాక్రా బజార్‌ను ఈ నెల 8న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించనున్న నేపథ్యంలో, భద్రతా మరియు బందోబస్తు ఏర్పాట్లను గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ సమీక్షించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన సరస్ ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయాతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వీవీఐపీ కాన్వాయ్ ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, సీఎం సందర్శించనున్న స్టాళ్లు, సభా వేదిక ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ, వీవీఐపీ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
ప్రదర్శన ప్రాంగణంలో క్షుణ్ణమైన తనిఖీలు నిర్వహించాలని, పరిసర ప్రాంతాల్లోనూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ పరిశీలనలో జిల్లా జాయింట్ కలెక్టర్ అషుతోష్ శ్రీవాత్సవ, ఆర్డీఓ, అదనపు ఎస్పీ, డీఎస్పీలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular