Homeఆంధ్రప్రదేశ్రెవెన్యూ సేవల డిజిటలైజేషన్

రెవెన్యూ సేవల డిజిటలైజేషన్

📰 Generate e-Paper Clip



రక్షణ న్యూస్, బాపట్ల

కుల ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా సుమోటో విచారణ చేపట్టి, ఆమోదించిన పత్రాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు.
బాపట్ల జిల్లాలో 3.94 లక్షల కుల ధ్రువీకరణ పత్రాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయగా, 3.25 లక్షల పత్రాలకు ఆమోదం లభించిందన్నారు. మిగిలిన విచారణ త్వరలో పూర్తవుతుందని తెలిపారు.
రెవెన్యూ అర్జీలను వేగంగా పరిష్కరించాలని స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్ కలెక్టర్లను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular