
ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతీయ విద్యార్థులపై వీసా స్క్రూటినీని మరింత కట్టుదిట్టం చేసింది. డౌన్ అండర్‌లో చదువుకునేందుకు వెళ్లాలనుకుంటున్న విద్యార్థుల కోసం సాక్ష్యాధార (ఎవిడెన్స్) స్థాయిలలో మార్పులు చేపట్టినట్లు ఆ దేశ హోమ్ అఫైర్స్ శాఖ వెల్లడించింది. కొత్త నిబంధనలు జనవరి 8 నుండి అమల్లోకి వచ్చాయి.
భారతదేశంతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ దేశాలను కూడా అత్యధిక ప్రమాద వర్గం (Highest-Risk Category)లోకి తరలించారు. ఈ దేశాలు Evidence Level 2 నుండి Evidence Level 3 కి మార్చబడ్డాయి. ఈ నిర్ణయానికి “కొత్తగా వెలుగు చూస్తున్న సమగ్రత సమస్యలు” కారణమని ఆస్ట్రేలియా హోమ్ అఫైర్స్ శాఖ పేర్కొంది.

