Homeఎడిటోరియల్పిఠాపురం పండగ

పిఠాపురం పండగ

📰 Generate e-Paper Clip


పీఠికాపురంలో జరుగుతున్న సంక్రాంతి మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేడు పిఠాపురం చేరుకున్నారు. ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి. సంప్రదాయ, జానపద కళాకారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు. వారితో కలిసి కల్చరల్ వాక్ చేస్తూ ఆయన కార్యక్రమ ప్రాంగణానికి చేరుకున్నారు.
అంతకుముందు, కాకినాడ హెలీప్యాడ్ వద్ద ఉప ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ, జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ శ్రీ అపూర్వ తేజ్ తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆత్మీయంగా స్వాగతం పలికారు.
సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ప్రజలు భారీగా తరలివస్తుండగా పీఠికాపురం పట్టణం పండుగ వాతావరణంతో కళకళలాడుతోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular