
గన్ మిస్‌ఫైర్:
హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య మృతి
నంద్యాల, రక్షణ న్యూస్:
నంద్యాల జిల్లా డోన్ జీఆర్‌పీ పోలీస్ స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా గన్ హ్యాండోవర్ చేస్తున్న సమయంలో మిస్‌ఫైర్ జరగడంతో హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది.
సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గన్ భద్రతా నిబంధనలు పాటించారా లేదా అన్న అంశంపై కూడా విచారణ జరుగుతోంది.

