Homeఎడిటోరియల్ఆగని మంటలు...

ఆగని మంటలు…

📰 Generate e-Paper Clip


నాంపల్లి అగ్నిప్రమాదం:

భవన దృఢత్వంపై అనుమానాలు

– కాసేపట్లో జేఎన్టీయూ ఇంజినీరింగ్ నిపుణుల బృందం

హైదరాబాద్, రక్షణ న్యూస్:

నాంపల్లిలోని ఫర్నిచర్ షాపు అగ్నిప్రమాద ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. గత 19 గంటలుగా భవనం సెల్లార్‌లలో మంటలు కొనసాగుతుండటంతో భవన భద్రతపై అధికారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెల్లార్‌లకు ఏర్పడిన రంధ్రాల ద్వారా పైకి పొగ వెలువడుతుండటంతో ప్రమాదం మరింత తీవ్రంగా మారింది.
ఈ నేపథ్యంలో భవనం దృఢత్వాన్ని అంచనా వేసేందుకు జేఎన్టీయూ ఇంజినీరింగ్ నిపుణుల బృందం కాసేపట్లో సంఘటన స్థలానికి చేరుకోనుంది. భవనం నిర్మాణ స్థితి, కూలిపోయే ప్రమాదం ఉందా లేదా అన్న అంశాలపై సమగ్రంగా తనిఖీ చేసి, అధికారులకు నివేదిక సమర్పించనుంది.
ఇదే సమయంలో అగ్నిమాపక శాఖ, రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా, పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular