Thursday, April 16, 2026
ads

ఉత్కంట…

📰 Generate e-Paper Clip

నాంపల్లి –

దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో నాంపల్లి కోర్టు విచారణ కీలక దశకు చేరుకుంది. టాలీవుడ్ నటులు వెంకటేశ్, రాణా, నిర్మాత సురేష్ బాబు, అభిరామ్‌లు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ రోజు హాజరు అవుతారా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
2022 నవంబర్ 13న GHMC సిబ్బంది, బౌన్సర్లతో కలిసి హోటల్‌ను అక్రమంగా కూల్చేసి, కోట్ల రూపాయల సామగ్రిని దొంగిలించారన్న ఆరోపణలతో హోటల్ యజమాని నందకుమార్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు స్వయంగా దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు చేయించింది.
అయినా అలాగే 2024 మార్చిలో మళ్లీ హోటల్‌ను పూర్తిగా నేలమట్టం చేశారన్న ఆరోపణలపై కూడా FIR నమోదు జరిగినప్పటికీ, దర్యాప్తు జరగలేదని నందకుమార్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.
గతంలో పలుమార్లు నోటీసులు అందినా విచారణకు గైర్హాజరైన దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఈ రోజు వ్యక్తిగత బాండ్లు సమర్పించాల్సి ఉంది.
ఈ సారి కూడా హాజరు కాకపోతే కోర్టు NBW జారీ చేసే అవకాశం ఉందని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హోటల్ యజమాని నందకుమార్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular