Friday, February 20, 2026
ads
Homeతెలంగాణశాసనమండలిలో కంటతడి పెట్టిన కవిత.. రాజకీయ వివక్షపై ఆవేదన

శాసనమండలిలో కంటతడి పెట్టిన కవిత.. రాజకీయ వివక్షపై ఆవేదన

📰 Generate e-Paper Clip

రక్షణ న్యూస్, తెలంగాణ

శాసనమండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. గత 8 ఏళ్లుగా ప్రజల కోసం తాను చేసిన ప్రయత్నాలను వ్యవస్థాపకంగా అడ్డుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
పార్టీ మౌత్‌పీస్‌లుగా పనిచేసే చానెళ్లు, పత్రికలు తనకు ఏనాడూ మద్దతుగా నిలవలేదని, తాను ప్రశ్నించిన ప్రతిసారి వ్యక్తిగత కక్ష ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఆ కక్షే చివరకు తనను పార్టీ నుంచి బహిష్కరించే స్థితికి తీసుకెళ్లిందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు నుంచి అమరజ్యోతి వరకు ప్రతి అంశంలో అవినీతి చోటు చేసుకుందని, ఉద్యమకారులు, సూటిగా ప్రశ్నించే వారిపట్ల వివక్ష చూపుతున్నారని కవిత ఆరోపించారు. తన పోరాటం వ్యక్తిగతం కాదని, ప్రజాస్వామ్య విలువల కోసం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular