Homeఎడిటోరియల్సీఎం ఆదేశాలు

సీఎం ఆదేశాలు

📰 Generate e-Paper Clip


డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో జరిగిన బ్లోఅవుట్ ఘటన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏరియల్ వ్యూ ద్వారా సమగ్రంగా పరిశీలించారు. ఘటన తీవ్రత, మంటల విస్తరణ, చుట్టుపక్కల నష్టాన్ని స్వయంగా పరిశీలించిన అనంతరం, సీఎం రాయవరంలోని మండపేట నియోజకవర్గంలో ఓఎన్జీసీ అధికారులు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎంపీ హరీష్, ఎమ్మెల్యే వరప్రసాద్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
బ్లోఅవుట్ నివారణ చర్యలు, మంట నియంత్రణకు తీసుకున్న చర్యలు, భద్రతా ఏర్పాట్లపై సీఎం అధికారులు అడిగి తెలుసుకున్నారు. వ్యాపించిన మంటల కారణంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలపై వెంటనే అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఘటన మళ్లీ పునరావృతం కాకుండా అత్యవసర భద్రతా ప్రోటోకాల్‌లు కచ్చితంగా అమలు చేయాలని ఆయన సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular