Homeఎడిటోరియల్సీపీ సీరియస్

సీపీ సీరియస్

📰 Generate e-Paper Clip

ఫోన్ టాపింగ్ వ్యాఖ్యలపై మంటలు…

ఆర్ఎస్ ప్రవీణ్‌కు సీపీ సజ్జనర్ నోటీసులు

రక్షణ క్రైమ్ న్యూస్ హైదరాబాద్…

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఎస్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ-పరిపాలనా వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సిట్ చీఫ్‌గా సజ్జనర్ అర్హతలపై ప్రశ్నార్థక వ్యాఖ్యలు చేస్తూ, తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ పేర్కొనడాన్ని సీపీ సజ్జనర్ తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొంటూ, ఆర్ఎస్ ప్రవీణ్‌కు సీపీ సజ్జనర్ అధికారిక నోటీసులు జారీ చేశారు. తనపై ఉన్నాయని చెబుతున్న ఏడు క్రిమినల్ కేసుల పూర్తి వివరాలను రెండు రోజుల లోపు అందజేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని నోటీసుల్లో స్పష్టం చేశారు.
అలాగే, ప్రజల్లో గందరగోళం సృష్టించేలా, కేసును తప్పుదారి పట్టించే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోందని సజ్జనర్ పేర్కొన్నారు. ఫోన్ టాపింగ్ వంటి సున్నితమైన అంశంలో బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరమని ఆయన అభిప్రాయపడ్డారు.
రెండు రోజుల లోపు స్పష్టమైన వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో చట్టం తన పని తాను చేస్తుందని హెచ్చరిస్తూ సీపీ సజ్జనర్ కఠిన స్వరం వినిపించారు. ఈ పరిణామంతో ఫోన్ టాపింగ్ అంశం మరింత రాజకీయ వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular