పిఠాపురం ఆర్ఆర్బీ హెచ్ ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి స్టాల్స్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. వ్యవసాయం, చేనేత జౌలి, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, లేపాక్షి హ్యాండ్‌క్రాఫ్ట్, పశుసంవర్థక, పర్యాటక శాఖలకు చెందిన స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు.
డిప్యూటీ సీఎంతో పాటు కాకినాడ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పి.నారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యే పంతం నానాజీ, ప్రభుత్వ విప్ పి.హరిప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ బిందు మాధవ్ తదితరులు కూడా స్టాల్స్‌ను సందర్శించారు.
పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌లో గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించిన పవన్ కళ్యాణ్, రాధాలపేట అంగన్‌వాడి చిన్నారులకు బోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు.
ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైన పీఠికాపుర సంక్రాంతి ఉత్సవాలను పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రారంభించారు. నియోజకవర్గంలో సుమారు రూ.211 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించారు.





