ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు–కార్యదర్శుల సమావేశం నేడు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకు ముగియనుంది. రాష్ట్ర అభివృద్ధి, జీఎస్‌డీపీ, పది సూత్రాలు, ఆదాయార్జన శాఖల పనితీరు, కేంద్ర పథకాల అమలు, పీపీపీ ప్రతిపాదనలు, ఆర్టీజీఎస్ ఫైల్ క్లియరెన్స్, డిజిటల్ సేవలు, రెవెన్యూ వ్యవహారాలు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, భూమి సర్వే, వికసిత్ భారత్–రొజ్గార్ & అజీవికా మిషన్ వంటి కీలక అంశాలపై సమగ్ర సమీక్ష చేపడుతున్నారు.



