
తెలంగాణ రాష్ట్రంలో పంటల కీలక సమయంలో యూరియా కొరత రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఫలితమని విమర్శించింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, హుజూరాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నారాయణపేట జిల్లాల్లో 25–30 శాతం వరకు కొరత ఉందని తెలిపింది. యూరియా యాప్ సరిగా పనిచేయక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. కొరత వల్ల బ్లాక్ మార్కెట్ పెరిగి పంటల దిగుబడి ప్రమాదంలో ఉందని ఆప్ హెచ్చరించింది. వెంటనే నిల్వలు విడుదల చేయాలని, బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.

