
ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు విశాఖపట్నంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాలు, హోమ్ శాఖకు సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ సానుకూల వాతావరణంలో సాగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

