Thursday, February 26, 2026
ads
Homeఎడిటోరియల్ఉచితంగా e-Shram కార్డు...

ఉచితంగా e-Shram కార్డు…

📰 Generate e-Paper Clip


అన్‌ఆర్గనైజ్డ్ కార్మికులకు e-Shram కార్డు ద్వారా భద్రతా ప్రయోజనాలు

ఉచిత రిజిస్ట్రేషన్ –

ప్రమాద బీమా సహా కేంద్ర పథకాల లబ్ధి

అన్‌ఆర్గనైజ్డ్ రంగంలో పనిచేసే కార్మికుల భద్రత, సంక్షేమం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన e-Shram కార్డు ద్వారా కార్మికులకు అనేక సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుబాటులోకి వస్తున్నాయి. రోజువారీ కూలీలు, ఆటో–లారీ డ్రైవర్లు, మేస్త్రీలు, దర్జీలు, గిరిజన కార్మికులు, డెలివరీ బాయ్స్, ఇంటి పనివారు తదితరులు ఈ పథకానికి అర్హులని నిర్వాహకులు తెలిపారు.
e-Shram కార్డు అనేది అన్‌ఆర్గనైజ్డ్ కార్మికులను గుర్తించి కేంద్ర ప్రభుత్వ డేటాబేస్‌లో నమోదు చేసేందుకు రూపొందించిన దేశవ్యాప్త లేబర్ ఐడెంటిటీ కార్డుగా అధికారులు వివరించారు. ఈ కార్డు ఉన్న కార్మికులకు భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా అందే అవకాశముంటుందని తెలిపారు.
ఈ కార్డు ద్వారా PM Suraksha Bima Yojana కింద ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.2 లక్షల బీమా, శాశ్వత వైకల్యం కలిగితే అదే మొత్తంలో, పాక్షిక వైకల్యానికి రూ.1 లక్ష బీమా లభిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా PM Shram Yogi Maandhan, PM Ujjwala Yojana, PM Awas Yojana, PM Jeevan Jyoti Bima Yojana తదితర సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు కూడా e-Shram కార్డు కలిగిన కార్మికులకు దక్కే అవకాశం ఉందన్నారు.
16 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి అన్‌ఆర్గనైజ్డ్ రంగంలో పనిచేసే కార్మికులు ఈ పథకానికి అర్హులని, రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితంగా జరుగుతోందని తెలిపారు. ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
e-Shram కార్డు రిజిస్ట్రేషన్ మరియు పూర్తి వివరాల కోసం 89788 86348 నంబర్‌ను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular