Thursday, April 16, 2026
ads
Homeఎడిటోరియల్కలెక్టర్ ఆదేశాలు....

కలెక్టర్ ఆదేశాలు….

📰 Generate e-Paper Clip

పార్క్ స్థల పరిశీలన

బాపట్ల జిల్లా

మార్టూరు మండలం నాగరాజుపల్లి గ్రామ సమీపంలో పార్క్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థల విస్తీర్ణం, మౌలిక సదుపాయాల కల్పనకు ఉన్న అవకాశాలపై అధికారులతో చర్చించారు.
ప్రజలకు వినోదం, విశ్రాంతి కల్పించేలా పచ్చదనం పెంపొందించే పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా పార్క్ అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ పరిశీలనలో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular