Thursday, February 26, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్గుంటూరులో తెలుగు మహాసభలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు

గుంటూరులో తెలుగు మహాసభలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

రక్షణ న్యూస్, గుంటూరు

గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జిల్లా ప్రతినిధులు, అధికారులు, కూటమి నేతలు, తెలుగు మహాసభల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ ఆచారాలతో జరిగిన స్వాగత కార్యక్రమం మహాసభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు భాష, సంస్కృతి, ప్రపంచవ్యాప్త గుర్తింపుపై చర్చలు జరగగా, మహాసభలు తెలుగు జాతి గౌరవాన్ని చాటుతున్న వేడుకగా మారాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular