
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు
వక్ఫ్ బోర్డ్ స్థలంలో 5 ఎకరాల్లో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కు భూమిపూజ చేసిన మంత్రి నారాయణ
1000 మంది పెద విద్యార్ధులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉచిత విద్య అందించేలా ఏర్పాట్లు
భూమి పూజ కార్యక్రమానికి భారీగా హాజరైన నెల్లూరు మైనారిటీలు ,టీడీపీ నాయకులు
పేదపిల్లల ఉన్నత చదువుకోసం పాటుపడుతున్న మంత్రి నారాయణకి కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ నిర్వహణ
తన కుమార్తె షరణి తో కలిసి ఇంటర్నేషనల్ స్కూల్ అభివృద్ది చేస్తానన్న మంత్రి
నెల్లూరు,తేది.04-01-25.
నెల్లూరులో పేద విద్యార్ధులకు కార్పొరేట్,అంతర్జాతీయ విద్య అందించడంపై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు..సొంత నియోజకవర్గమైన నెల్లూరు సిటీతో పాటు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నారు…లక్షల్లో కాదు..కోట్లు ఖర్చు పెట్టి స్కూల్స్ అభివృద్ది చేయడంతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు..తాజాగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రూరల్ నియోజకవర్గంలో ఉన్న పరమేశ్వర నగర్ లో 20 కోట్లతో అంతర్జాతీయ స్థాయి స్కూల్ ఏర్పాటుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి,ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి,వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ తో కలిసి భూమి పూజ చేసారు మంత్రి నారాయణ…
వక్ఫ్ బోర్డు స్థలంలో 5 ఎకరాల్లో పేద విద్యార్ధులకు ఉచితంగా విద్యనందించేందుకు ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు..దీనికోసం అనకాపల్లి ఎంపీ శ్రీ సీఎం రమేష్ 20 కోట్లు సీఎస్ ఆర్ నిధులు అందించారు..భూమి పూజ కార్యక్రమం మైనార్టీ పెద్దలు,పార్టీ నాయకులు,విద్యార్ధులు,తల్లిదండ్రుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది..వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి 1000 మంది విద్యార్ధులకు ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ అడ్మిషన్లు ప్రారంభించేలా నిర్మాణం పూర్తిచేయాలని నిర్ణయించారు.ఇప్పటికే నెల్లూరు సిటీలో తాను చదువుకున్న
వీఆర్సీ పాఠశాలను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్ది మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా గత విద్యాసంవత్సరంలో ప్రారంభించారు…ఇదే తరహాలో నెల్లూరులో ఉన్న మరో 14 స్కూల్స్ ను తన కుమార్తె షరణి,ఇతర దాతల సహకారంతో తీర్చిదిద్దుతానని మంత్రి నారాయణ ఇప్పటికే హామీ ఇచ్చారు.
తాజాగా భూమిపూజ జరిగిన ఈ ఇంటర్నేషనల్ స్కూల్ లో మెజార్టీ మైనార్టీ విద్యార్ధులకు ప్రయోజనం ఉండగా,ఇతర పేద విద్యార్ధులకు కూడా అడ్మిషన్లు ఇవ్వనున్నారు.భూమి పూజ తర్వాత జరిగిన బహిరంగ సభలో మంత్రి నారాయణ మాట్లాడారు.ఈ స్కూల్ కు అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ గా నామకరణం చేసారు.
పేద విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించినప్పుడే నా లక్ష్యం నెరవేరుతుందన్న మంత్రి.
చదువే సమాజంలో అందరికీ గౌరవం పెంచుతుందని.. ఆ చదువు వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించినప్పుడే నా లక్ష్యం నెరవేరుతుందన్నారు.నెల్లూరు సిటీ పరిధిలో సుమారుగా 94 వేల ఇళ్లు ఉండగా…గత ఎన్నికల సమయంలో84 వేల ఇళ్లకు డోర్ టు డోర్ కాంపెయిన్ కు వెళ్లానన్నారు…అప్పుడే పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. తాను కటిక పేదరికం నుంచి వచ్చిన వాడినని పేదరికం విలువ తెలుసని అన్నారు. తన గురువు నారాయణమూర్తి ద్వారా ఫౌండేషన్ ఏర్పడిందని ఆయన తెలిపారు. నగరంలోని 15 పాఠశాలలను అభివృద్ధి చేసే విధంగా పలువురు దాతలు సహకారం తీసుకోవడం జరిగిందన్నారు. అందులో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, డి ఎస్ ఆర్ కన్స్ట్రక్షన్స్ నుంచి సుధాకర్ రెడ్డి, డాక్టర్ భాస్కర్, సీఎం రమేష్, రెడ్డి ల్యాబ్స్, మరియు టీవీఎస్ కంపెనీ నుండి సహకారం తీసుకోవడం జరిగిందన్నారు. నెల్లూరు నగరంలో సుమారు 200 కోట్ల రూపాయలతో పాఠశాలలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. తాను చదివిన విఆర్ పాఠశాల అభివృద్ధికి తన కూతురు షరిణీ మరియు ఎన్సిసి గ్రూపులు సహాయ సహకారాలు అందించారు అన్నారు. అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ పాఠశాలను కూడా తన కూతురు షరిణీ సహాయంతో పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
నారాయణ విద్యాసంస్థలలో సుమారు ఏడు లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారని 50 వేల మంది వరకు ఉద్యోగస్తులు ఉన్నారని ఆయన తెలిపారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని దానిని ఎన్సిసి గ్రూపు డిజైన్ చేసిందని ఆయన తెలిపారు. కావలసిన నిధులను సి ఎస్ ఆర్ ఫండ్స్ ద్వారా సమకూర్చడం జరుగుతుందన్నారు. పది రోజుల క్రితం రోడ్డు మార్గాన్ని వెళుతూ అబ్దుల్ అజీజ్ తో ఈ డివిజన్ అభివృద్ధిపై చర్చించడం జరిగింది అన్నారు. స్కూలు ఏర్పాటుకు స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఎప్పటినుంచో నిరాదరణకు గురై ఉన్న స్థలంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. దీనికి సంబంధించిన నిధులను సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మంత్రి నారాయణ గారు సమకూర్చడం జరుగుతుందని ఆయన తెలిపారు. పేద బిడ్డల భవిష్యత్తు విద్యతో సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఆస్తులు విషయంలో తేడాలు ఉండవచ్చు కానీ విద్య విషయంలో అందరు సమానమేనని ఆయన అన్నారు.
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వక్ఫ్ స్థలంలో ఇంటర్ నేషనల్ స్కూల్ నిర్మించాలన్న ఆలోచన చాలా గొప్పదని..అబ్దుల్ కలాం పేరు పెట్టడం అభినందనీయమన్నారు.మైనారిటీలు అంటే సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక అభిమానం అన్నారు..
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు ప్రజలకి మంత్రి నారాయణ ఇచ్చినవరం వక్ఫ్ స్థలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు అని…మంత్రి నారాయణ సిటీ నియోజకవర్గానికి శాశ్వత ఎమ్మెల్యే అని తెలిపారు..వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరుకి శాశ్వత ఎంపీ అని.. వీఆర్ హైస్కూల్ ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారన్నారు..చంద్రబాబు నాయుడు హయాంలోనే బారాషహీద్ దర్గా అభివృద్ధి చెందిందని..రూరల్ లో వైఎస్సార్సీపీ పాలనలో గురుకుల పాఠశాల అభివృద్ధి అటకెక్కిందన్నారు..
ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాష, నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ హసీనా, మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్, పలువురు నేతలు తదితరులు పాల్గొన్నారు


