రక్షణ న్యూస్, గుంటూరు
ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా, పారదర్శకంగా అందేలా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ స్పష్టం చేశారు. చీరాల మోటార్ వాహనాల తనిఖీ అధికారి కార్యాలయాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసి, లోపాలపై అధికారులను నిలదీశారు.
ప్రధాన అంశాలు:
ఆన్‌లైన్ సేవలకు ప్రాధాన్యత – వాట్సాప్ గవర్నెన్స్, వాహన్, సారథి పోర్టల్స్‌పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశం
బయోమెట్రిక్ అమలు లేమి – హాజరు కోసం ఆన్‌లైన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచన
378 లైసెన్సులు పెండింగ్ – వెంటనే పరిశీలించి మంజూరు చేయాలని ఆదేశాలు
మధ్యవర్తులకు చెక్ – ఏజెంట్ల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలను వినియోగించాలన్న సూచన
లైసెన్స్ ప్రక్రియ పరిశీలన – రిజిస్ట్రేషన్, ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంపై తనిఖీ
డ్రైవింగ్ ట్రాక్, సొంత భవనం డిమాండ్ – ఎంవీఐ కలెక్టర్‌కు విజ్ఞప్తి
ప్రభుత్వ సేవల నాణ్యతను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

