Monday, February 23, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్స్కిల్ చాంపియన్స్‌గా బాపట్ల విద్యార్థులు

స్కిల్ చాంపియన్స్‌గా బాపట్ల విద్యార్థులు

📰 Generate e-Paper Clip

రక్షణ న్యూస్, బాపట్ల

రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో బాపట్ల జిల్లా విద్యార్థులు అగ్రస్థానాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో విజేత విద్యార్థులను అభినందించిన కలెక్టర్, వారి కృషి–అంకితభావం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
డిసెంబర్ 29న విజయవాడలో జరిగిన స్టేట్ లెవల్ స్కిల్ కాంపిటీషన్స్–2025–26లో బాపట్ల జిల్లాకు చెందిన విద్యార్థులు హెల్త్‌కేర్, అగ్రికల్చర్ విభాగాల్లో రాణించారు. జడ్‌పి హైస్కూల్, మేడరమెట్లకు చెందిన విద్యార్థి హెల్త్‌కేర్ విభాగంలో ప్రథమ స్థానం (రూ.25,000) సాధించగా, నక్షత్రనగర్‌లోని ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ బాలికల పాఠశాల విద్యార్థిని అగ్రికల్చర్ విభాగంలో రెండో స్థానం (రూ.15,000) దక్కించుకున్నారు.
వృత్తి విద్య ద్వారా విద్యార్థులు భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకుంటున్నారని డీఈఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ విజయాలు జిల్లా విద్యాశాఖ సమిష్టి కృషికి నిదర్శనమని అధికారులు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular