Saturday, February 21, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్ప్రజా సమస్యల పరిష్కార వేదిక: బాపట్ల

ప్రజా సమస్యల పరిష్కార వేదిక: బాపట్ల

📰 Generate e-Paper Clip

బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు.
జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారులు భూ సమస్యలు, సంక్షేమ పథకాలు, పౌర సదుపాయాలకు సంబంధించిన ఫిర్యాదులు వినిపించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో పాటు డీఆర్వో గంగాధర్ గౌడ్, డిప్యూటీ కలెక్టర్ లవన్న కూడా అర్జీల స్వీకరణలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ విజయలక్ష్మి, డీఈఓ డి. శ్రీనివాస్, సీపీఓ ఏ.ఎస్. రాజు, గృహ నిర్మాణ సంస్థ పీడీ వెంకటేశ్వరరావు, మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ, డీసీహెచ్‌ఎస్ పద్మావతి, డీఎం & హెచ్‌వో డాక్టర్ విజయమ్మ, సివిల్ సప్లయిస్ డీఎం శ్రీలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘునాధ్ రెడ్డి సహా వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular