రక్షణ న్యూస్
రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, అధికారులతో మాట్లాడిన సీఎం, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంటలను వెంటనే అదుపులోకి తీసుకురావాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పరిస్థితిపై నిరంతర సమాచారం అందించాలని స్పష్టం చేశారు.

