

కాకినాడలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హెలిప్యాడ్ వద్ద అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏఎం గ్రీన్ సంస్థ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి అభివాదం చేశారు.
ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పర్యావరణహిత పరిశ్రమలకు ప్రోత్సాహం లభించనుందని, ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయని నేతలు అభిప్రాయపడ్డారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన వేదికకు చేరుకున్నారు.

