


రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో జలవిహార్‌లో ‘ARRIVE ALIVE’ రోడ్డు భద్రత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జాయింట్ సీపీ జోయెల్ డేవిస్, సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ పాల్గొని 300 బైక్‌లతో నిర్వహించిన భారీ ర్యాలీని ప్రారంభించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

