Thursday, February 26, 2026
ads

ప్రమాదం

📰 Generate e-Paper Clip


మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండ్ అవుతుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. రన్‌వేపై దిగే క్రమంలో నియంత్రణ కోల్పోయిన విమానం కూలిపోవడంతో వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక దళాలు, సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానంలో అజిత్ పవార్‌తో పాటు మరో ఐదు మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అజిత్ పవార్ బారామతిలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరవ్వడానికి వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రమాదానికి గల కారణాలపై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular