వైసీపీ హయాంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే, ఏపీ మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ ఉండవల్లి శ్రీదేవి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, మహిళల భద్రతపై జగన్ మాట్లాడటం దుర్యోధనుడు ధర్మం గురించి చెప్పినట్లేనని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో మహిళలపై నేరాలు పెరిగాయని, కీలక ఘటనలపై జగన్ స్పందించలేదని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మహిళా భద్రత, ఆర్థిక సాధికారతకు కట్టుబడి పనిచేస్తోందని, రుణాలు, ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు, ‘తల్లి వందనం’ వంటి పథకాలతో మహిళలకు అండగా నిలుస్తోందని తెలిపారు.


