Thursday, February 26, 2026
ads
Homeఎడిటోరియల్జగన్ డ్రామా...

జగన్ డ్రామా…

📰 Generate e-Paper Clip


వెలిగొండ ‘జాతికి అంకితం’ డ్రామా – అసలు నిజాలు

బయటపెట్టిన మంత్రి నిమ్మల రామానాయుడు

అమరావతి సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్ట్ పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అసంపూర్తి పనులతోనే 06-03-2024న జగన్ ప్రభుత్వం పోలీస్ పహారా మధ్య ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. టన్నెల్స్, హెడ్ రెగ్యులేటర్లు, ఫీడర్ కాలువ, డైవర్షన్ రోడ్లు, నిర్వాసితుల పరిహారం అన్నీ అపూర్ణంగానే ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బెంచింగ్, లైనింగ్, కాలువ పనులు వేగంగా సాగుతున్నాయని, జూన్ 2026 నాటికి కీలక పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. జగన్ హయాంలో పూర్తికాని ప్రాజెక్టును పూర్తయినట్టు ప్రచారం చేయడమే ప్రజాద్రోహమని మంత్రి తేల్చిచెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular