రక్షణ న్యూస్
రంగారెడ్డి జిల్లా మొకిల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
అతివేగంతో వెళ్తున్న స్పోర్ట్స్ కారు చేవెళ్ల మీర్జగూడ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి చెట్టును గుద్దుకుంది.
ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
మృతులు ICFAI యూనివర్సిటీ విద్యార్థులుగా గుర్తించారు.
మరణించినవారు సూర్యతేజ, నిఖిల్, సుమిత్, రోహిత్‌గా పోలీసులు తెలిపారు.