rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 6:32 am Digital Edition : RAKSHANA DAILY DESK

అమెరికాలో రోడ్డు ప్రమాదం: పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి

అమెరికా వాషింగ్టన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన కృష్ణకిశోర్, ఆశ దంపతులు మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి కుమారుడు, కుమార్తె చికిత్స పొందుతున్నారు.
పది రోజుల క్రితమే స్వగ్రామం పాలకొల్లుకు వచ్చి వెళ్లిన ఈ కుటుంబం, మార్గమధ్యంలో దుబాయ్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నట్లు సమాచారం. ఇంతలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం అందరినీ కలచివేసింది.
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కృష్ణకిశోర్ మృతితో పాలకొల్లులో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.