rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 3:25 pm Digital Edition : RAKSHANA DAILY DESK

డయల్ యువర్ కమిషనర్‌ ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం<br><br><br>

రక్షణ న్యూస్, గుంటూరు

గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యలను నేరుగా మాట్లాడి పరిష్కరించుకునేందుకు ఈ నెల 5వ తేదీ (సోమవారం) డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు కమిషనర్ చాంబర్‌లో (0863-2224202) ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని, అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని నిర్వహించి, జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు.