
పల్నాడు, జనవరి 3:
జిల్లా వ్యాప్తంగా 90 వేలకుపైగా నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. వినుకొండ నియోజకవర్గం నీల గంగవరం గ్రామంలో జరిగిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లాలో రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేశామని, ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల స్వాధీనం చర్యలు చేపడతామని కలెక్టర్ చెప్పారు. 1906 తర్వాత రాష్ట్రంలో మళ్లీ రెవెన్యూ సర్వే జరుగుతోందన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీ.వి ఆంజనేయులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ పథకం ద్వారా భూములకు ప్రభుత్వ రాజముద్రతో పాస్‌పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. వినుకొండ మండలంలోనే 6,775 పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ఆర్డీఓ మధులత, తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.