rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 9:13 am Digital Edition : RAKSHANA DAILY DESK

అమెరికాలో తెలుగు యువతి హత్య.. మాజీ ప్రియుడే హంతకుడిగా అనుమానం

అమెరికాలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. మేరీల్యాండ్ రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగు యువతి నికితా రావు (27) హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక ఆమె మాజీ ప్రియుడు అర్జున్ వర్మ (26) ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
వెడా హెల్త్ సంస్థలో డేటా అండ్ స్ట్రాటజీ ఎనలిస్ట్‌గా పనిచేస్తున్న నికితా, డిసెంబర్ 31న ఎల్లికాట్ సిటీలో చివరిసారిగా కనిపించిందని అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 2న ఫిర్యాదు అందుకున్న పోలీసులు, 3న అర్జున్ అపార్ట్‌మెంట్‌లోనే నికితా మృతదేహాన్ని గుర్తించారు.
అయితే అదే రోజు అర్జున్ భారత్‌కు పారిపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. నికితాను హత్య చేసి, మృతదేహాన్ని అపార్ట్‌మెంట్‌లో వదిలేసి అతడు దేశం విడిచినట్టు పోలీసులు భావిస్తున్నారు.
భారత్‌కు పరారైన అర్జున్‌ను అరెస్టు చేసేందుకు ఫెడరల్ పోలీసుల సహకారం కోరినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటన అమెరికాలోని తెలుగు సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.