rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 12:30 pm Digital Edition : RAKSHANA DAILY DESK

వేగం వద్దు – భద్రం ప్రాణం

రక్షణ న్యూస్, గుంటూరు

డ్రైవర్లు ఏకాగ్రతతో, పరిమిత వేగంతో వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీహరి తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శంకర కంటి ఆసుపత్రిలో డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన, కంటి పరీక్షలు నిర్వహించారు.
అతివేగం, నిద్ర మత్తు ప్రమాదాలకు కారణమని పేర్కొంటూ, డ్రైవింగ్‌లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డ్రైవర్లకు బీపీ, షుగర్ పరీక్షలు, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు.