rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 9:49 am Digital Edition : RAKSHANA DAILY DESK

మలికిపురంలో గ్యాస్ బ్లో అవుట్‌ కలకలం… రంగంలోకి మంత్రి సుభాష్

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలంలో గ్యాస్ బ్లో అవుట్‌తో ఎగసిపడుతున్న మంటలపై కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆరా తీశారు.
👉 ఘటనపై జిల్లా కలెక్టర్‌, కంపెనీ ప్రతినిధులతో మంత్రి చర్చలు జరిపారు.
👉 ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
👉 ప్రమాద ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్‌కు సూచించారు.
👉 మంటలను తక్షణమే అదుపులోకి తేవాలని సంబంధిత అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.
పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.