rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 05 January 2026, 7:19 am Digital Edition : RAKSHANA DAILY DESK

గవర్నర్‌కు ఘన స్వాగతం

రక్షణ న్యూస్ గుంటూరు

గుంటూరు విచ్చేసిన త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనా రెడ్డికు ఘన స్వాగతం లభించింది. గుంటూరు ఐటీసీ హోటల్ వద్ద అదనపు ఎస్పీ హనుమంతు, ఆర్డీఓ శ్రీనివాసరావు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో సాయంత్రం 5 గంటలకు గవర్నర్ పాల్గొననున్నారు.