rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 8:11 am Digital Edition : RAKSHANA DAILY DESK

సూపర్ సీఐ….

సీఐ రాంబాబుకు అంజుమన్ కమిటీ అభినందనలు

కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలులో మహారాష్ట్రకు చెందిన డకాయిట్ గ్యాంగ్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న పట్టణ సీఐ రాంబాబు గారిని అంజుమన్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. ప్రయాణికుల రద్దీ మధ్య మూడు నిమిషాల్లోనే నిందితులను పట్టుకోవడం ద్వారా సీఐ రాంబాబు ప్రదర్శించిన ధైర్యం, సమయస్ఫూర్తిని కమిటీ సభ్యులు ప్రశంసించారుసీఐ రాంబాబు చేసిన ఈ ఆపరేషన్‌ బాపట్లలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని, ప్రజల భద్రత కోసం ఇలాంటి ధైర్యవంతులైన అధికారులు ఉండటం గర్వకారణమని అంజుమన్ కమిటీ పేర్కొంది.
అభినందనలు తెలిపే కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పాల్గొని సీఐ రాంబాబుకు శాలువా కప్పి సన్మానించారు.