rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 2:29 am Digital Edition : RAKSHANA DAILY DESK

సీయం షెడ్యూల్..

అమరావతి, జనవరి 6
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి అధికారిక కార్యక్రమాల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు కీలక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు.
ఉదయం 10.30 గంటలకు సచివాలయానికి చేరుకునే ముఖ్యమంత్రి, 11.30 గంటలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సీఆర్డీయే అథారిటీ సమావేశానికి హాజరవుతారు. అనంతరం 3.15 గంటలకు లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తల కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు ఆయన నివాసానికి చేరుకుంటారు.