rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 8:08 am Digital Edition : RAKSHANA DAILY DESK

వెల్కమ్ సార్…

జిఎంసి నూతన కమిషనర్‌గా శనివారం బాధ్యతలు స్వీకరించిన కె. మయూర్ అశోక్, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు.
నగర పాలన, శాంతిభద్రతల పరిరక్షణలో సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఈ భేటీలో ఇరు అధికారులు ప్రస్తావించారు. నగర అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించారు.