rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 7:44 am Digital Edition : RAKSHANA DAILY DESK

రెడ్ బుక్  రాజ్యాంగం నడుస్తుంది

మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రాజ్యాంగ పాలన కాకుండా ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. ఒక్క గురజాల నియోజకవర్గంలోనే గత 18 నెలల కాలంలో ఏడు ప్రభుత్వ హత్యలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. నిన్నటికి నిన్న వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త సాల్మన్ హత్య ఇందుకు తాజా ఉదాహరణగా ఆయన తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరులపై వేధింపులు పెరిగాయని, వందలాది కుటుంబాలను పోలీసుల సహాయంతో గ్రామాల నుంచి తరిమేశారని కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. ఇలా బలవంతంగా తరిమివేయబడిన కుటుంబాలు గుంటూరుకు వెళ్లి తీవ్ర కష్టాలతో, దుర్భర జీవితం గడుపుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని విమర్శించిన ఆయన, వెంటనే ఈ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.