
మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత అజిత్ పవార్ మృతిపై సంతాపం తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి నేతలు మహారాష్ట్రకు వెళ్లారు. మంత్రి నారా లోకేష్‌తో పాటు అనగాని సత్యప్రసాద్ అమరావతి నుంచి బారామతికి బయలుదేరారు. అజిత్ పవార్ మరణం నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించి, వ్యక్తిగతంగా నివాళులు అర్పించాలన్న ఉద్దేశంతోనే ఈ పర్యటన చేపట్టినట్టు సమాచారం.
బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నేతలు అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలియజేసి, ధైర్యం చెప్పనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
అజిత్ పవార్ మరణంతో బారామతి ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. అంత్యక్రియల సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతుండటంతో స్థానికంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.