
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్‌ను ఆయన నివాసంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. మద్యం అక్రమ కేసులో సుదీర్ఘకాలం జైల్లో ఉన్న చెవిరెడ్డి నిన్న బెయిల్‌పై విడుదలయ్యారు. తనపై, కుటుంబ సభ్యులపై పెట్టిన తప్పుడు కేసులపై జగన్‌కు వివరించారు. అక్రమ కేసులపై ఆందోళన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కోవాలని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు. ప్రజల పక్షాన పోరాటంలో పార్టీ నాయకులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ భేటీలో చెవిరెడ్డి కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పాల్గొన్నారు.