
బాపట్ల పట్టణ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో బాపట్ల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్–సీవీఏపీ (P-4) కార్యాలయం ఆధ్వర్యంలో ప్రజా దర్బార్–గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు స్వయంగా ప్రజల వద్ద నుంచి పిర్యాదులు, వినతుల్ని స్వీకరించారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా తెలుసుకున్న ఎమ్మెల్యే, సంబంధిత శాఖాధికారులతో వెంటనే మాట్లాడి వాటిని శీఘ్రంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యం అని, ప్రతి ఫిర్యాదును ట్రాక్ చేస్తూ అమలు జరుగుతున్న విధానాన్ని పర్యవేక్షిస్తామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు తెలిపారు.
కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.