rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 1:36 am Digital Edition : RAKSHANA DAILY DESK

పల్నాడులో పవన్ పర్యటన…

కోటప్పకొండ–కొత్తకోట రోడ్డును ప్రారంభించనున్న

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

నరసరావుపేట, జనవరి 22
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కోటప్పకొండ–కొత్తకోట రోడ్డు మార్గాన్ని ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి శిలాఫలకం వద్ద మీడియా పాయింట్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు మాత్రమే మీడియా పాయింట్ వద్దకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన సమయంలో కోటప్పకొండ కొండపైకి మీడియా మిత్రులకు అనుమతి లేదని తెలిపారు.