rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 30 January 2026, 5:58 am Digital Edition : RAKSHANA DAILY DESK

నేటి తరానికి ఆదర్శం

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ చేసిన స్వాతంత్ర్య ఉద్యమ సేవలను సీఎం గుర్తు చేశారు. అహింస, సత్యం మార్గాలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.