rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 7:12 am Digital Edition : RAKSHANA DAILY DESK

టీ హబ్ పై సీఎం స్పష్టత

టీ-హబ్‌ను పూర్తిగా స్టార్టప్‌ల కేంద్రంగా కొనసాగించాలని సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు తరలించాలన్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని సూచించారు. అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలను ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని ఆదేశించారు. టీ-హబ్‌లో స్టార్టప్‌లకే ప్రాధాన్యం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.