

చేవెళ్ల మున్సిపాలిటీ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జిగా వడ్డేపల్లి రాజేశ్వరరావు
తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, చేవెళ్ల మున్సిపాలిటీ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావును పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఫారాలు స్వీకరించారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో చేవెళ్లను కైవసం చేసుకుంటామని, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.