rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 09 January 2026, 3:59 am Digital Edition : RAKSHANA DAILY DESK

రోడ్డు ప్రమాదం…

నల్గొండ –
మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడా చౌరస్తా వద్ద గురువారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంకర్‌ను డీసీఎం ఢీకొట్టడంతో ఘటన భారీగా మారింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులంతా బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.