rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 7:24 am Digital Edition : RAKSHANA DAILY DESK

కారుతో ఢీ కొట్టి పరార్

నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా పోలీసులపై దాడికి పాల్పడి సంచలనం సృష్టించింది. కారులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ సౌమ్యా వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా, నిందితులు ఆగకుండా కారుతో ఆమెను ఢీకొట్టి పరార్‌కు యత్నించారు. ఈ ఘటనలో సౌమ్యాకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అప్రమత్తమైన పోలీసులు ముఠాను వెంటాడి అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి గంజాయి మరియు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.