rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 5:59 pm Digital Edition : RAKSHANA DAILY DESK

కాంగ్రెస్ నాటకం…

కంటోన్మెంట్ విలీనంపై కాంగ్రెస్ దీక్ష నాటకం

: మన్నె కృశాంక్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎనిమిది రోజులపాటు చేసిన దీక్షతో ఏమి సాధించారో ప్రజలకు చెప్పాలని మన్నె కృశాంక్ డిమాండ్ చేశారు. ఆ దీక్షకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఒక్క మంత్రి కూడా హాజరుకాలేదని విమర్శించారు. కంటోన్మెంట్ విలీనంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో చర్చించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా విలీనంపై మిశ్రమ స్పందన ఉందని, చాలామంది వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారని తెలిపారు.
కంటోన్మెంట్ విలీనానికి మద్దతుగా నేటి నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ చేపట్టి, వాటిని బీజేపీ–కాంగ్రెస్ జాతీయ నాయకులకు అందిస్తామని ప్రకటించారు. శాంతిర్యాలికి అనుమతి ఇవ్వకపోయినా, కాంగ్రెస్ ఎమ్మెల్యేకు దీక్షకు అనుమతి ఇవ్వడం ద్వంద్వ వైఖరని ఆరోపించారు. రాజకీయ రంగులేకుండా ఈ ఉద్యమం సాగుతుందని, మొదటి సంతకం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో తీసుకుంటామని వెల్లడించారు.