rakshanadaily.com
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 9:16 am Digital Edition : RAKSHANA DAILY DESK

కమిషనర్ బదిలీలు

గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఆయనను మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా నియమించింది.
శ్రీనివాసులు స్థానంలో కె. మయూర్ అశోక్ గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు మయూర్ అశోక్ విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు.
కొత్త కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మయూర్ అశోక్‌ నుంచి నగర పరిపాలనలో మరింత చైతన్యం ఆశిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.